గద్దెపై కొలువుదీరిన సమ్మక్క…!

-

మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తుల పారవశ్యం, శివసత్తుల పూనకాలు, గిరిజన యువతుల నృత్యాలు, డోలు వాయిద్యాలు, అధికార లాంఛనాల నడుమ చిలకలగుట్ట నుంచి వచ్చిన సమ్మక్క మేడారం గద్దెపై కొలువుదీరారు. దారి పొడవునా అమ్మవారికి భక్తులు నీరాజనాలు పలికారు. ఇప్పటికే సారలమ్మ గద్దెపై కొలువుదీరగా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రంగా మారింది.

సమ్మక్కను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ భాగంగా ముందుగా వడ్డెలు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లారు.అనంతరం వనం (వెదురు కర్రలు ) తీసుకొచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క పూజామందిరంలోని అడేరాలు తీసుకొచ్చి గద్దెలపైకి చేర్చారు. ఆ తర్వాత చిలుకలగుట్టకు వెళ్లి ప్రధాని పూజారితో కలిసి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని మేడారం బయలుదేరగా మంత్రి సీతక్క వనదేవతకు స్వాగతం పలికారు. ఎస్పీ పి.శబరీశ్‌ ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాల ప్రకారం ఏకే-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు. పోలీసులు చిలుకలగుట్ట నుంచి బందోబస్తు నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version