సిరిసిల్లా వ్యవసాయ కళాశాల ప్రత్యేకతలు ఇవే

-

దేశంలో ఎక్కడా లేనివిధంగా, అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన.

రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ కళాశాల నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా, జిల్లెల్లలో ప్రారంభంకానున్నది.

శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి తో కలిసి మంత్రి శ్రీ కేటీఆర్ ఈ వ్యవసాయ కళాశాలను నేడు ప్రారంభించనున్నారు. 35 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కళాశాలను నిర్మించింది. 16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ప్రయోగశాల, సెమినార్‌ రూములు, ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version