అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం..ఆస్తుల జప్తు

-

అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆస్తులను అటాచ్ చేసింది మొత్తానికి 4109 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా అగ్రి గోల్డ్ హాయ్ లాండ్ కు  చెందిన 40 ఎకరాల భూమిని కూడా అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్ సంబంధించిన చైర్మన్ తో పాటు ముగ్గురు డైరెక్టర్లని ఈడీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది.

రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలోని అగ్రిగోల్డ్ ఆస్తులని ఇప్పుడు ఈడీ అటాచ్ చేసింది. ఏపీ లోని 56 ఎకరాల హాయ్ లాండ్ ఆస్తులు అటాచ్ అయ్యాయి. పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలని కూడా ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం. ఇక అగ్రిగోల్డ్ పై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version