HCU భూములపై AI వీడియోలు.. సెలబ్రిటీలు, కేంద్రమంత్రి, మాజీ మంత్రులు, ధ్రువ్ రాఠీపై కేసులు!

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వాడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాకుండా, తెలంగాణ సమాజాన్ని తప్పు దోవ పట్టించారని ఆరోపణలతో పలువురిపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు 7 కేసులు నమోదు చేయగా.. కొణతం దిలీప్, మన్నే క్రిషాంక్, థామస్ అగస్టీన్ పైనా కేసులు నమోదయ్యాయి. కొందరు ఏఐ ఫొటోలు పెట్టారని కూడా కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదైన వారిలో కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా ఉండగా.. మరికొందరు ప్రముఖులపైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు సమాచారం.

AI ఫొటోలను తయారు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఐటీ టీమ్ సభ్యులను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరితో పాటు HCU వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపైనా పోలీసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news