చాలా శాతం మంది ఉద్యోగం వలన ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. కేవలం పని ఎక్కువగా ఉండడం మాత్రమే కాకుండా అధికారులు, తోటివారు కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి ఒత్తిడులను ఎదుర్కొంటున్నప్పుడు సరైన విధంగా పరిష్కరించుకోకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కనుక ఇటువంటి పొరపాట్లను అస్సలు చేయకండి. ఆఫీసులో ఎలాంటి పని ఉన్నా సరే అసలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పుడైతే పని పట్ల శ్రద్ధ ఉంటుందో, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఉన్నత అధికారుల నుండి ఎటువంటి ఒత్తిడి ఉండదు.
ఆఫీస్ లో ఉదయం పని ప్రారంభం చేసినప్పటి నుండి పూర్తి చేసినంత వరకు సరైన బాడీ లాంగ్వేజ్ ఎంతో అవసరం. ఎందుకంటే ఒక పని గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు సరైన బాడీ లాంగ్వేజ్ ఎంతో అవసరం. అంతేకాకుండా పని చేస్తున్నప్పుడు నెగిటివ్ విషయాలను అస్సలు చర్చించకూడదు. ఇతరులతో అనవసరమైన విషయాల గురించి మాట్లాడటం వలన చులకన భావం ఏర్పడుతుంది. కనుక నెగిటివ్ విషయాల గురించి మాట్లాడకపోవడమే మేలు. ముఖ్యంగా సహ ఉద్యోగుల గురించి గాసిప్స్ అస్సలు చేయకూడదు.
ఇలా చెడుగా మాట్లాడటం వలన ఇమేజ్ డామేజ్ అయ్యే అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటుగా ఆఫీసుకు వెళ్లేటప్పుడు సమయపాలన ఎంతో అవసరం. ముఖ్యంగా మీటింగ్ లను అటెండ్ అయ్యేటప్పుడు సమయానికి వెళ్లాలి. ఇలా చేయడం వలన పని పట్ల శ్రద్ధ తెలుస్తుంది. మీ తోటి వారితో మాట్లాడేటప్పుడు సరైన విధంగా కమ్యూనికేట్ చేయాలి. ఎప్పుడైతే మంచి కమ్యూనికేషన్ జరుగుతుందో పనులు కూడా సరైన విధంగా పూర్తి అవుతాయి. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు తోటి వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే ఫీడ్ బ్యాక్ రూపంలో మీ తప్పులను తెలుసుకుంటారో వాటిని సరి చేసుకునే అవకాశం మీకు వస్తుంది. కనుక ఇటువంటి మార్పూలను కచ్చితంగా చేసుకోవాలి.