బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఎయిర్ ఇండియా ఉద్యోగి

-

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా ఉద్యోగి పట్టుబడిన ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కిలోన్నర బంగారాన్ని రెండు చేతులకు చుట్టుకుని షఫీ అనే వ్యక్తి బహ్రెయిన్‌ నుంచి వచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు షఫీని తనిఖీ చేయగా బంగారం సంగతి బయటపడింది. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బంగారాన్ని చేతుల‌కు చుట్టుకుని, దాని మీద నుంచి ష‌ర్ట్ వేసుకుని షఫీ ప్రయాణించాడు. గ్రీన్ ఛాన‌ల్ ద్వారా దాటే ప్ర‌య‌త్నం చేసిన ష‌ఫీని క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ బంగారాన్ని షఫీ ఎక్కడికి తరలిస్తున్నాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. షఫీని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు.

మరోవైపు సింగపూర్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను చెన్నై విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.4 కోట్ల విలువైన ఏడు కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version