IND VS AUS : ఈజీ క్యాచ్ మిస్ చేసిన భరత్..దారుణంగా ట్రోలింగ్

-

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు జరుగుతోంది. ఇవాళ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3-1తో సిరీస్‌ సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది.


ఈ మ్యాచ్ జరుగుతున్న నరేంద్రమోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా దేశాల ప్రధానమంత్రులు సందడి చేశారు. నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి హాజరయ్యారు. అయితే, ఈ మ్యాచ్‌ ప్రారంభంలోనే, ఆసీస్‌ ఓపెనర్‌ హెడ్‌ ఇచ్చిన సింపుల్‌ క్యాచ్‌ ను భరత్‌ వదిలేశాడు. దీంతో కేఎస్‌ భరత్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చి పోతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version