ఎయిరిండియా విమానం రద్దు.. ప్రయాణికులు ఆగ్రహం..!

-

వారంతా ప్రయాణం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని.. రోజుల తరబడి నిరీక్షించి.. చివరికి ప్రయాణ సమయం దగ్గర పడిన టైమ్ కి అష్టకష్టాలు పడి ఎయిర్పోర్టుకు చేరుకున్నాక.. విమాన ప్రయాణం క్యాన్సిల్ అయిందని వార్త తెలియగానే ప్యాసింజర్స్లోలో కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేముంది సిబ్బందిపై ప్రయాణికులు రగిలిపోయారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం పూణె ఎయిర్పోర్టులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

శుక్రవారం  6:40 గంటలకు పూణె నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం వెళ్లాల్సి ఉంది. అయితే అన్ని చెకింగ్లు పూర్తి చేసుకుని లోపలికి వెళ్లాక విమాన ప్రయాణం రద్దైందని అనౌన్సెమెంట్ రాగానే ప్రయాణికుల్లో తీవ్ర అసౌకర్యానికి గురై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది దగ్గరకు వెళ్లి నిలదీశారు. మరికొంత మంది ఘర్షణకు దిగారు. ఇంకొంతమంది అక్కడ్నే ధర్నా చేశారు. ఇలా ఎయిరిండియా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ప్రయాణికులు విమానయాన సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ. కనీసం తమను పట్టించుకోలేదని.. తాగేందుకు కూడా నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు జవాబు ఇచ్చినవారే లేరని వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version