గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ వద్ద ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగ అపహరించాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసిన వ్యక్తి మొహానికి మాస్క్ ధరించి ఒక్కసారిగా అటాక్ చేశాడు. వెనుకనుంచి వచ్చిన దొంగ మహిళ మెడలో నుంచి గొలుసును గట్టిగా లాగగా.. ఆమె కింద పడపోయింది.
బలవంతంగా చైన్ తెంపుకుని దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ – నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దొంగను పట్టుకునేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించినా ఎస్కేప్ అయినట్లు సమాచారం. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీసీ ఫుటేజ్.. నార్సింగిలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ – నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయిన దొంగ
గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు.. మహిళ వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు… pic.twitter.com/PdmRrMlxOG
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2025