రేపే టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా

-

ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియాను కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే విక్ర‌యించిన విష‌యం తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద కంపెనీల‌లో ఒక‌టి అయిన టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. గ‌తంలో 100 శాతం వాటా కేవ‌లం కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్దే ఉండేవి. కానీ టాటా గ్రూప్ రూ. 18 వేల కోట్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. కాగ రేపు ఎయిర్ ఇండియా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి టాటా గ్రూప్ చేతిల్లోకి వెళ్ల‌నుంది.

ఎయిర్ ఇండియా బాధ్య‌త‌ల‌ను పూర్తిగా టాటా గ్రూప్ న‌కు కేంద్ర ప్ర‌భుత్వ అందించ‌నుంది. కాగ ఎయిర్ ఇండియాను అతి త‌క్కువ ధ‌ర‌కు కేంద్ర ప్రభుత్వం విక్ర‌యిస్తుందని ప్ర‌తిప‌క్ష‌లు ఆరోపిస్తున్నాయి. అలాగే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను విక్ర‌యిస్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగ ఎయిర్ ఇండియా 1932 లో టాటా గ్రూప్ న‌కు చెందిన‌ టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. కానీ రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాగా మారింది. కాగ మ‌ళ్లీ ఇప్పుడు తిరిగి టాటా గ్రూప్ కు మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version