పొల్యూషన్ ఎఫెక్ట్.. తాజ్‌మహల్ దగ్గర ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్ల ఏర్పాటు..!

-

ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ దగ్గర ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (యూపీపీసీబీ), ఆగ్రానగర్ నిగమ్, వొడాఫోన్ ఐడియా సీఎస్‌ఆర్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్లు రెండింటిని ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అక్కడ కొన్ని రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, మరోవైపు కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి, బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. కాలుష్యం కారణంగా అక్కడి తాజ్‌మహల్‌కు ముప్పు పొంచి ఉందని వెల్లడి కావడంతో దాని పరిరక్షణకు, దాన్ని చూసేందుకు వచ్చే టూరిస్టుల ఆరోగ్యం కోసం ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు నడుం బిగించాయి.

ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ దగ్గర ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (యూపీపీసీబీ), ఆగ్రానగర్ నిగమ్, వొడాఫోన్ ఐడియా సీఎస్‌ఆర్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్లు రెండింటిని ఏర్పాటు చేశారు. ఒక వ్యాన్ 300 మీటర్ల పరిధిలో ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. 8 గంటల్లో ఒక్క వ్యాన్ ఆ పరిధిలో ఉన్న సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజ్‌మహల్‌తోపాటు అక్కడికి వచ్చే సందర్శకుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఆ ప్రాంతంలో రెండు ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్లతో కొంత వరకు నష్టాన్ని అధిగమించవచ్చని, అయితే ఇలా ఎన్ని రోజుల పాటు ఆ వ్యాన్లను ఉంచాలన్నది మాత్రం ఇంకా నిర్దారణ కాలేదని అక్కడి అధికారులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version