ఐశ్వర్య రాయ్ మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

-

సంవత్సరాలు గడుస్తున్నా ఐశ్వర్యరాయ్ అందంలో మాత్రం ఏమాత్రం తేడా లేదని చెప్పవచ్చు. ఎవరికైనా సరే వయసు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది. కానీ ఐశ్వర్య వయసు పెరిగే కొద్దీ ఆమె అందం కూడా రెట్టింపు అవుతోంది. ఇకపోతే తాజాగా ఈమె కెరీర్ స్టార్టింగ్ లో ఫ్యాషన్ షో కోసం కట్టిన ఫీజు రసీదు ఇటీవల బయటపడి అది కాస్త బాగా వైరల్ గా మారుతుంది. మరి అప్పట్లో ఐశ్వర్యరాయ్ ఎంత ఫీజు కట్టింది… ఎన్ని సంవత్సరాలు అవుతోంది.. అంతేకాదు ఆమె మొదటి సంపాదన ఎంత ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఐశ్వర్యారాయ్ తాజాగా క్రేన్ ఫిలిం ఫెస్టివల్ లో బ్లాక్ డ్రెస్లో తళుక్కుమని మెరిసిన విషయం తెలిసిందే. ఇక 21 సంవత్సరాలుగా ఐశ్వర్యారాయ్ అంతర్జాతీయ వేదిక మీద మెరుస్తూనే ఉంది. ఐశ్వర్య సొగసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమె ప్రస్థానం ఎట్టిదో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇకపోతే తాజాగా ఐశ్వర్యరాయ్ ప్రస్థానం గురించి మరొక చర్చ కొనసాగుతోంది. ఇందుకు గల కారణం ఏమిటి అంటే ఐశ్వర్య వయసు గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ గా మారుతుంది. 30 సంవత్సరాల క్రితం ఫ్యాషన్ షో నుంచి .. కంపెనీ నుంచి ఆమె సంపాదించిన డబ్బు దాని రిసిప్ట్ బయటపడటమే ఇందుకు కారణం.

ఎంత సంపాదించింది .. తన ఫస్ట్ సంపాదన ఎంత అనే విషయం అందరికీ తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 1994లో మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్యరాయ్ అంతకంటే ముందు మోడలింగ్ చేసేది. ఇక 1992లో జరిగిన ఒక మ్యాగజైన్ తాలూకు ఫోటోషూట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఇక ఐశ్వర్య అప్ కమింగ్ మోడల్ అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న రోజులవి ఇక ముందుగా కృపా క్రియేషన్స్ అనే సంస్థ కోసం ఆమె కెమెరా ముందుకు వచ్చింది. సల్వార్ కమీజ్ ధరించి ఇచ్చిన ఐశ్వర్యరాయ్ ఫ్యాషన్ క్యాటలాగ్ కోసం అక్షరాల 1500 రూపాయల ను అందుకుంది . ఇక ఇదే ఆమె మొదటి సంపాదన . ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం ఆమె సంపాదన రూ.800 కోట్లకు పైగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version