కారు టైర్లు పేలిపోవడానికి ఇవే కారణాలు.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!

-

సమ్మర్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వీటికి ప్రధాన కారణం.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా టైర్లు పేలడం. ఏటా టైర్లు పేలి, పగిలిపోయి ఎన్నో ప్రమదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. అసలు టైర్లు ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పేలిపోతాయో చూద్దామా..!
టైర్ పగిలిపోవడానికి అతి పెద్ద కారణం అందులోని గాలి. వాస్తవానికి టైర్‌లో పరిమిత మొత్తంలో గాలి ఉండాలి. అప్పుడు కారు బరువును తట్టుకుంటుంది..అయితే హైవేపై వేగంగా వెళ్లేటప్పుడు టైర్లు వేడెక్కుతాయి. టైర్‌లో పరిమితి కంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు అవి వేడి తట్టుకోలేక పగిలిపోతాయి.

సరికాని గాలి పీడనం

కారు టైర్‌లో గాలి పీడనం ఎక్కువ లేదా తక్కువ ఉన్నప్పుడు టైర్ పగిలిపోతుంది. చాలామంది.. రోడ్డు పక్కన కొత్తవారితో గాలిని నింపిస్తారు. వల్ల వారు ఎక్కువ లేదా తక్కువ నింపడం వల్ల.. టైర్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. టైరులో గాలి తక్కువైతే లోడింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. టైరు ఇరుపక్కలా బీటలు ఏర్పడతాయి. ఇది మైలేజీపై ప్రభావం పడుతుంది. ఎక్కువైతే కుదుపులతో ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది. ఇవన్నీ తప్పాలంటే తరచుగా తప్పనిసరిగా గాలి చెక్‌ చేసుకోవాలని ఆటోమొబైల్‌ నిపుణులు సూచిస్తున్నారు. వాహన సామర్థ్యానికి మించి బరువులు వేయడమే వాహనం ఏదైనా టైర్లు త్వరగా పాడవడానికి, పేలిపోవడానికి, ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం అని చెబుతున్నారు అందుకే పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న ఎయిర్ ఫిల్లింగ్ మెషిన్‌తో గాలిని నింపాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది.

కొత్త టైర్లను ఉపయోగించాలి

కొత్త టైర్లనే కారుకు వినియోగించాలి. కానీ కొంతమంది ధర తక్కువగా ఉంది కాదా అని సెకండ్ హ్యాండ్ టైర్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది ప్రమాదాలకు దారతీస్తుంది.. సెకండ్ హ్యాండ్ టైర్లు చాలా తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. కొత్త వాటితో పోలిస్తే పగిలిపోయే అవకాశాలు ఎక్కువే.

ఓవర్‌ లోడింగ్‌

కారు టైర్లు పగిలిపోవడానికి ఓవర్‌లోడింగ్ అతిపెద్ద కారణం. కారు టైర్‌కు నిర్ణీత పరిమితి ఉంటుంది. కానీ ఓవర్‌లోడింగ్ కారణంగా టైర్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా అవి పగిలిపోతాయి.
డ్రైవింగ్‌లోనూ పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..రాష్‌ డ్రైవింగ్‌, అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడం, అత్యధిక వేగం, మలుపుల దగ్గర సడెన్‌గా తిప్పడం.. టైరు వేడెక్కడానికి కారణాలవుతాయని, ఇలాంటి పరిణామాలు టైరు లైఫ్ తగ్గిపోతుంది. ఇక.. అరిగిపోయిన టైర్లు బ్రేక్‌ వేసినా ఆగకుండా స్కిడ్‌ అయి ప్రమాదాలకు కారణమవుతాయని, బురదలో కూరుకుపోతే కదలవని చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. కారు టైర్లు పగిలిపోకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version