Big Boss OTT Telugu: అప్పుడు బాధపడ్డానన్న అజయ్..ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అని కామెంట్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT ఎనిమిదో వారం పూర్తయింది. కంటెస్టెంట్స్ అందరూ తొమ్మిదో వారంలోకి ఎంటరయ్యారు. ఇక ఎనిమిదో వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో బోలెడంత చర్చ జరిగింది. హౌజ్ నుంచి అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, అజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో చేసిన వ్యాఖ్యలు చాలా హుందాగా ఉండటం గమనార్హం.

ఎవరిపైన నెగెటివ్ కామెంట్స్ చేయకుండా ఆట గురించి సలహాలు, సూచనలు ఇచ్చేసి బయటకు వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ గేమ్ గురించి, కంటెస్టెంట్స్ గురించి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు అజయ్. ఇంటి నుంచి శ్రవంతి ఎలిమినేట్ అయినపుడు తాను బాగా బాధపడ్డానని పేర్కొన్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు హౌజ్ లో ఉన్న వారిలో బిందు మాధవి స్ట్రాంగ్ ప్లేయర్ అని ప్రశంసించాడు.
ఇక హౌజ్ లో ఉన్న అఖిల్ తనకు ఫస్ట్ ఫ్రెండయ్యాడని, హౌజ్ లోకి వెళ్లిన తొలినాళ్లలో తాను, అఖిల్, శివ బెడ్ షేర్ చేసుకున్న సంగతులను గుర్తు చేసుకున్నాడు అజయ్. హౌజ్ నుంచి బయటకు వచ్చిన అజయ్ ఇక మళ్లీ తన నార్మల్ లైఫ్ లీడ్ చేయబోతున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version