మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో మహా సర్కార్ అఖిలపక్ష సమావేశం… రాజ్ ఠాక్రే పార్టీ దూరం

-

మహారాష్ట్ర రాజకీయాలు హనుమాన్ చాలీసా, మసీదుల్లో లౌడ్  స్పీకర్ల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే మహరాష్ట్ర నవ నిర్మాణ సేన( ఎంఎన్ఎస్) పార్టీ మే 3 లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే… హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. అయితే  సమావేశానికి ఎంఎన్ఎస్ పార్టీ హాజనుకాబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మతకలహాలు సృష్టించి…రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర చూస్తుంది అంటూ మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఆరోపించారు. 

మరోవైపు హనుమాన్ చాలీస్ వివాదం కూడా రాష్ట్రంలో రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలు మహారాష్ట్ర సీఎం ఇళ్లు ‘మాతో శ్రీ’ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామనడం వివాదాస్పదం అయింది. దీంతో  శివసేన కార్యకర్తలు శనివారం నవనీత్ కౌర్ ఇంటిముందు ఆందోళన నిర్వహించారు. ఈ వివాదంలో ఎంపీ దంపతులిద్దరు అరెస్ట్ అయ్యారు. బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హాలిడే అండ్ సండే కోర్టు ఆదివారం ఎంపీ నవనీత్ రాణా మరియు ఎమ్మెల్యే రవి రాణాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version