తలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయన చేపట్టిన పాదయాత్ర నిన్న నారాయణ పేట మండలం లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యులు ఆయనకు వైద్యం అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…. ఏదోలా ఉందనీ బండి సంజయ్ చెప్పారని, వెంటనే చికిత్స అందించామని, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. బెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించానని వైద్యులు వివరించారు. మరోవైపు సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. బిజెపి నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్టు తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈరోజు ఆయన పాదయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ ల మీదుగా కొనసాగనుంది. మక్తల్ టౌన్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.