పల్టీలు కొట్టిన అజిత్ రేసింగ్ కారు.. డ్రైవింగ్ మోడ్ విజువల్స్ రిలీజ్

-

తమిళ హీరో అజిత్ ఇటీవల ఓ రేసింగ్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి అజిత్ కుమార్ టీం అని పెట్టారు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన రేసింగ్ పోటీల్లో అతని బృందం మూడోస్థానంలో నిలిచింది. దానికి ముందు అజిత్ కూడా కారు డ్రైవింగ్ చేస్తుండగా..ట్రాక్ మీద అతని కారు ప్రమాదానికి గురవడంతో ఆయన పోటీకి దూరమయ్యారు.

తాజాగా అజిత్ కుమార్‌ స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌ పోటీల్లో పాల్గొనగా.. ఆయన కారు మరోసారి ప్రమాదానికి గురైంది.మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ట్రాక్ మీద నుంచి ఫీల్డులోకి దూసుకెళ్లగా.. రెండు సార్లు అజిత్ కారు గాల్లోనే గింగిరాలు తిరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పటికే వైరల్ అవుతుండగా.. తాజాగా ప్రమాదానికి గురైనప్పుడు కారు లోపలి దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version