యూట్యూబ్ లో సంచ‌లనాలు సృష్టిస్తున్న అఖండ‌

-

బాల‌కృష్ణ బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ట్రైల‌ర్ ను రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. అయితే ఈ అఖండ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ప్ర‌స్తుతం అఖండ ట్రైల‌ర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ -2 లో ఉంది. అంతే కాకుండా ఈ ట్రైల‌ర్ విడుద‌ల అయిన రెండు రోజుల్లో 15 మిలియ‌న్ల కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.

దీంతో పాటు 3,89 ల‌క్ష‌ల‌ కి పైగా లైక్స్ కూడా వ‌చ్చాయి. అయితే ఈ అఖండ ట్రైల‌ర్ విడుద‌ల అయిన 24 గంట‌ల‌లో దాదాపు 3.51 ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. అయితే ఈ అఖండ సినిమా లో బాలయ్య రెండు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా ఆ పాత్ర లో బాల‌య్య లుక్స్ కూడా మాస్ లెవ‌ల్ లో ఉన్నాయి. అంతే కాకుండా బాలయ్య డైలాగ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. అయితే బాల‌య్య అఖండ సినిమా ను వ‌చ్చే నెల 2 న థీయేట‌ర్ ల లో విడుద‌ల చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version