శివ భక్తుడిగా అక్షయ్ కుమార్.. ‘శంభు’ వీడియో సాంగ్ విడుదల

-

‘ శంభు’ అనే ఓ భక్తిరస సంగీత వీడియో సాంగ్‌ ఈ నెల 5వ తేదీ సోమవారం రిలీజ్ కానున్నది. ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ శివభక్తుడిగా నటించారు. భగవంతుడి పట్ల నిజమైన భక్తిని ప్రసరింపజేస్తూ, అంకితభావంతో శివభక్తుడిగా తన రూపాంతరాన్ని ప్రదర్శిస్తున్న ఓ పోస్టర్‌ను అక్షయ్‌కుమార్‌ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే అదే సాంగ్ ను అక్షయ్‌కుమార్‌ గానం చేశారని తెలుస్తోంది.

విక్రమ్‌ మంట్రోస్‌,సుధీర్‌ యదువంశీలతో కలిసి అక్షయ్‌కుమార్‌ శంభు ట్రాక్‌కి తన విలక్షణమైన టచ్‌ని అందించి పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్లారని మేకర్స్‌ చెప్తున్నారు. అభినవ్ శేఖర్ సాహిత్యం అందించగా, విక్రమ్ మాంట్రోస్ సంగీతం అందిస్తున్నాడు.మహాశివరాత్రి వేడుక పురస్కరించుకొని శివుడికి అంకితం చేసిన గీతమే ఈ ‘శంభు’. లోతైన భక్తిభావాన్ని ప్రేరేపితం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. అక్షయ్‌కుమార్‌ శివభక్తుడిగా కనిపిస్తుండటం ఇది రెండవసారి. గతంలో ‘ఓ మైగాడ్‌-2’ చిత్రంలో ఆయన శివభక్తుడిగా నటించిన సంగతి అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version