బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్న తాజా చిత్రం `లక్ష్మీ బాంబ్`. హారర్ కామెడీ నేపథ్యంలో రాఘవ లారెన్స్ నటించి తెరకెక్కించిన చిత్రం `కాంచన` తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇదే చిత్రాన్ని హిందీలో `లక్ష్మీబాబ్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాఘవ లారెన్స్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డుని సృష్టించబోతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీతో పాటు థియేటర్లలోనూ ఒకే రోజున రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 9న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. అక్షయ్‌కుమార్ ట్రాన్స్ జెండర్‌గా కనిపించబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఓవర్సీస్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఈలలో ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.
ప్రపంచంలో కరోనా అంతగా ప్రభావం చూపని దేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఈ నిలిచాయి. అందుకే ఈ చిత్రాన్ని ఈ దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలిన అనంతరం ఓవర్సీస్లో రిలీజ్ అవుతున్న తొలి భారతీయ సినిమా కావడంతో ఈ మూవీ రిలీజ్ ఆసక్తికరంగా మారింది.