ఓర్నీ తస్సాదియా..మందు కోసం చుక్కలు చూపిస్తున్న కోడి..

-

ఆరోగ్యానికి మంచిది తీసుకోండి అంటే ఎవ్వరూ తీసుకోరు..ఏదైతే మనం చెయొద్దని అంటామో అదే చెస్తున్నారు.మందు తాగొద్దురా భాయ్ అంటే వినే నాధుడు లేడు.. మనుషులు మాట పక్కన పెడితే ఆఖరికి జంతువులు కూడా అదే దారిలో ఉన్నాయి..అసలే కోతి ఆపై కళ్ళు తాగితే అన్న సామెత వినే ఉంటారు.అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి కోడి వచ్చి చేరింది.ఇప్పుడు మనం చెప్పుకొనే కోడి మామూలు కోడి కాదు. అన్నీ కోళ్లకు గింజలు, నీళ్ళు పెడితే చాలు..కానీ ఈ కోడికి మాత్రం ఫుల్ బాటిల్ ఉండాలట..ఏంటి.. నిజమా..అవును అండీ మీరు విన్నది అక్షరాల నిజం.

ఆ కోడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..మహారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజభోగాన్ని అనుభవిస్తుంది. ఆ కోడి పుంజుకు ప్రతిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్దకూడా ముట్టధు..ఆఖరికి మంచినీళ్లు కూడా తాగదు. ప్రాణమైనా పోగొట్టుకునేందుకు సిద్ధమవుతుంది.. కానీ మందు లేకుంటే బతకలేదు. ఇలాంటి అరుదైన ప్రవర్తన కలిగిన వారు మనుషుల్లో కనిపిస్తారు. కోడిపుంజు సైతం నేను మనిషికంటే ఏం తక్కువ తిన్నానా అన్నట్లు ప్రవర్తిస్తోంది.

ఓ రోజు కోడి పుంజుకు ఆహారాన్ని అందించాడు. అయితే అది ముట్టుకోలేదు. రోజంతా అలానే ఉంది. మంచినీరు పెట్టినా తాగలేదు. దీంతో మరుసటి రోజు కోడిపుంజుకు మద్యాన్ని అందించే సరికి గటగటా తాగేసి వెంటనే ఆహారాన్ని తీసుకుంది. ఖంగుతిన్న యాజమాని.. మద్యానికి బానిసైందని గుర్తించాడు. కోడిపుంజుకోసమని ప్రత్యేకంగా మందు తెప్పించి ప్రతిరోజూ కొంచెం పోసి దానికి ఆహారం అందిస్తున్నాడు. ఈ విచిత్ర ఘటన చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. అయితే కోడి పుంజుకు కేవలం మద్యం అందించేందుకు యాజమానికి నెలకు రూ.2వేలు ఖర్చు అవుతుంది. ఖర్చు భరించలేని భావుకాతోరే పశువైద్యాధికారిని సంప్రదించాడు..అయితే ఆ కోడికి డాక్టర్ ఆ వాసన వచ్చే మాత్రలను ఇచ్చారు.అలా ఇప్పుడు అది బ్రతికి ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version