ఆధార్ కార్డు కలిగిన వారికి అలర్ట్… ఇక ఈ సేవలు వుండవు..!

-

మనకి వున్న కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికీ ఉపయోగ పడుతుంది. స్కీమ్స్ మొదలు ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పని సరి.

ఇది ఇలా ఉంటే మనం ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కూడా ఈజీగా కరెక్ట్ చేసేయచ్చు. పేరు మొదలు ఎన్నో వాటిని సరి చెయ్యచ్చు. ఆధార్‌ లో అడ్రస్ కూడా మనం మార్చుకోవచ్చు. అయితే యూఐడీఏఐ మాత్రం ఆధార్ అడ్రస్ అప్‌డేట్‌ ని కాస్త కఠినం చేసారు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే..

గతం లో అయితే వ్యాలిడేషన్ ప్రూఫ్‌తో ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండేది. కానీ దానిని యూఐడీఏఐ తొలగించింది. అయితే ఇది టెంపరరీగా మాత్రమే. మరో నోటీస్ వచ్చే వరకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండదని యూఐడీఏఐ తెలిపింది. అలానే ఆధార్‌ లో అడ్రస్ మార్చుకోవడానికి పలు రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒక్కటి ఉన్నా సరిపోతుంది. పాస్‌పోర్ట్, బ్యాక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్, రేషన్ కార్డు, పోస్టాఫీస్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ వంటి వాటి ఆధారంగా మార్చుకోవచ్చు.

ఆధార్ కార్డుని ఇక పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి అప్డేట్ చేస్తారు..!

మీ ఆధార్ కార్డు లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ తప్పుగా వుంటే.. ఇలా ఈజీగా మార్చేయండి..!

మీ ఆధార్ కార్డును డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌తో వాలిడేట్ చేయండిలా..!

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version