మీ ఆధార్ కార్డు లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ తప్పుగా వుంటే.. ఇలా ఈజీగా మార్చేయండి..!

-

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆధార్ కార్డు ఉంటేనే ఏ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. అదే విధంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కి, బ్యాంక్ ఖాతా ఓపెన్ చెయ్యడానికి ఇలా ఎన్నో బెనిఫిట్స్ వున్నాయి. అయితే ఈరోజు ఎలా ఆధార్ లో తప్పులని సరిచెయ్యచ్చో చూద్దాం.

మీ ఆధార్ కార్డు లో వివరాల అన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాల ముఖ్యం. ఒకవేళ ఏమైనా తప్పులు వున్నాయి అంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి తప్పులు ఉండొచ్చు.

మీ ఆధార్ కార్డు లో అటువంటి తప్పులు ఉన్నాయా..? అయితే ఇలా సరి చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు. ఇక దీని కోసం చూస్తే.. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్ వంటి వివరాలు తప్పుగా ఉంటే కేవలం ఇంట్లో నుండే కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ అప్‌డేట్ చేసుకున్న ప్రతిసారి రూ.50 చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.

పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్ వంటి వివరాలు తప్పుగా ఉంటే.. మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే కరెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి.ఒకవేళ మీ ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేదు అంటే అప్డేట్ చేసుకోవడం అస్సలు అవ్వదు. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్ వంటి వివరాలు అప్డేట్ చెయ్యడానికి తప్పక సపోర్ట్ డాక్యుమెంట్స్ కావాలి. వీటిని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ముందుగా Uidai అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి.. అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చెయ్యాలి.
ఆ తరువాత update address in your Aadhaar మీద క్లిక్ చెయ్యాలి. ఇక్కడ అడ్రెస్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్, పేరు, జెండర్ వంటివి కూడా మార్చచ్చు.
ఇప్పుడు proceed to update Aadhaar link మీద క్లిక్ చేసి ఆనలైనా పోర్టల్ నుండి వివరాలని మార్చుకోవచ్చు.
అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చెయ్యండి.
ఓటీపీ మొబైల్ నెంబర్ కి వస్తుంది.
సరైన పేరు, అడ్రెస్, డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ ని ప్రూఫ్స్ కింద సబ్మిట్ చెయ్యాలి.
ఇలా ఆధార్ ని అప్డేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version