డీఎస్సీ పరీక్షలలో మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందనున్నాయి. ఈరోజు విద్యాశాఖ వెబ్సైట్ లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. పోస్టుకు ఒకరి చొప్పున వెరిఫికేషన్ కు పిలవనున్నారు. రేపటి నుంచి జిల్లాలలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రెండు మూడు రోజులలో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వెరిఫికేషన్ కు హాజరుకాని వారు సర్టిఫికెట్లు, సమర్పించని వారి స్థానంలో మెరిట్ జాబితాలోని మిగతా వ్యక్తులకు అవకాశాన్ని కల్పించబోతున్నారు.

ఇక డీఎస్సీ ఫలితాలలో కొంతమంది ఏకంగా నాలుగైదు పోస్టులకు అర్హత సాధించారు. ఈ వార్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక పోస్ట్ కోసమే ఎన్నో ఇబ్బందులు పడే వారు ఎందరో ఉన్నారు. అలాంటి సమయంలో కొంతమంది నాలుగైదు పోస్టులను సాధించడంతో విద్యాశాఖ సైతం ఆశ్చర్యానికి గురవుతోంది. అలాంటి వారికి తప్పకుండా పోస్టులను ఇవ్వబోతున్నారు. ఈ ఫలితాలలో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఉత్తీర్ణులు అవడం ప్రత్యేక విశేషం అని చెప్పవచ్చు.