సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్య పెళ్లి కొడుకు అవతారాన్ని ఎత్తాడు. కృష్ణంరాజు ఏకంగా ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల క్రితం 13 ఏళ్ల బాలికను నాలుగవ వివాహం చేసుకున్నాడు. అతని గురించి తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.

ఈ విషయం పైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ కృష్ణంరాజును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అనంతరం అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కృష్ణంరాజు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. నేటి కాలంలో మోసం చేయడం వివాహాలు చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. వివాహం తర్వాత కూడా చాలామంది జంటలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. వివాహ బంధానికి ఎవరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో చాలా జంటలు మధ్యలోనే విడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకీ ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.