కళ్ళు చూడగానే వాళ్ల క్యారెక్టర్ చేపేస్తాను…ఆలియా భట్..!

-


అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకు తానుగా సినిమా ఇండస్ట్రీలో మంచి స్థానానికి ఎదిగింది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఆలియా భట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూబాయి కథియావాడి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆలియా భట్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అందులో భాగంగా ఎదుటి వ్యక్తిలో నిజాయతీని ఇష్టపడతానని చెప్పుకొచ్చిన ఆలియా భట్ మగవారి కళ్లు చూడగానే వారి క్యారెక్టర్‌ను ఎంతో కొంత అంచనా వేయొచ్చు అంది. చీకటి అంటే భయం అని, ఎవరైనా ఎదురైతే వాళ్ల పెర్‌ఫ్యూమ్‌ ఏమిటో చెక్‌ చేయడానికి వాసన చూడడం తన బలహీనతని ఆలియా భట్ చెప్పుకొచ్చింది.

అలాగే తన హ్యాండ్‌ బ్యాగ్‌లో తప్పనిసరిగా నాలుగైదు పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు ఉంటాయి అని ఆలియా భట్ తెలియజేసింది. కచ్చితంగా రాత్రి నిద్రపోయే ముందు డైరీ రాస్తాను అని అందులో ముఖ్యమైన విషయాలను రాస్తాను అని ఆలియా భట్ తెలియజేసింది. ఇలా ఆలియా భట్ తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version