తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు..టీఆర్‌ఎస్‌ గూటికి నలుగురు సీనియర్లు !

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మరో నలుగురు సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. ప్రవర్తన కారణంగా.. కారు డోరు తీసేందుకు సిద్ధమయ్యారట.

కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్క, అలాగే.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఈ నలుగురు కీలక నేతలంతా త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకు గుడ్‌ బై చెప్పి.. గులాబీ గూటికి చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారట. డేట్‌ ఫిక్స్‌ చేసుకోలేదు కానీ.. ఇప్పటికే గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు తో చర్చలు నిర్వహించినట్లు సమాచారం అందుతోంది.

ఇందులో భాగంగానే.. ఇటీవలే… కోమటి రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క… టీఆర్‌ఎస్‌ పార్టీ సర్కార్‌ ప్రశంసలు కురిపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. వీరు పార్టీ మారుతారా ? అనే దానిపై మరికొన్ని రోజుల్లనే క్లారిటీ రానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version