బ్రహ్మస్త్రం సినిమాపై ట్రోల్స్​… అలియా రెస్పాన్స్ ఇదే!

-

రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’ తొలి వీకెండ్‌లో మంచి కలెక్షన్లు సాధించి ఈ ఏడాది భారీ విజయాలు సాధించిన సినిమాల జాబితాలో నిలిచింది. మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ చిత్రంలో అలియా భట్‌ పాత్ర నిడివి, ఆమె డైలాగులను సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్రం’ టీంతో పాటు అహ్మదాబాద్‌ పర్యటనలో ఉన్న అలియా భట్‌ను ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఆమె స్పందించింది. తనపై, బ్రహ్మస్త్రం సినిమాపై వస్తున్న ట్రోల్స్‌పై అలియా తన అభిప్రాయాన్ని తెలిపింది. ‘బ్రహ్మాస్త్రం’లో మీ పాత్ర, మీ డైలాగులపై ఎక్కువ విమర్శలు వస్తుండటంపై మీ స్పందనేంటి? అని ప్రశ్నించగా ‘‘మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కేవలం పాజిటివ్‌ అంశాలపైనే దృష్టి సారించాలి. ఇతర వాటిపై పరిమితులు ఉండాలి. ఎక్కువగా పాజిటివ్‌ విషయాలనే మనం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రేక్షకుల అభిప్రాయంగా వచ్చే విమర్శలను నేను గౌరవిస్తా. బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా ఆడుతుందంటే ‘బ్రహ్మస్త్రం’లో పాజిటివ్‌ అంశాలు చాలా ఉన్నాయి. మీరు వాటిపైనే దృష్టి పెట్టండి’’ అంటూ అలియా సమాధానమిచ్చింది.

అయితే ఇదే ప్రశ్నను కొద్ది రోజుల క్రితం ‘బ్రహ్మాస్త్రం’ దర్శకుడు అయాన్‌ ముఖర్జీను అడగగా.. అలియా ‘బ్రహ్మాస్త్రం’లో అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు. కథకున్న ప్రాముఖ్యం కారణంగా అలియా పాత్ర నిడివి తక్కువైందనిపిస్తుంది కానీ అలియా రోల్‌ ఈ సినిమాకు చాలా కీలకం అని అయాన్‌ తెలిపారు. బ్రహ్మాస్త్రం పార్ట్‌-2: దేవ్‌లో అలియా పాత్ర ఎక్కువ సాహసాలు చేయాల్సి ఉంటుందని అయాన్‌ పేర్కొన్నారు. 2025 చివరిలో ‘బ్రహ్మాస్త్ర పార్ట్‌ 2: దేవ్‌ విడుదల కావచ్చని అయాన్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version