తెలంగాణ విమోచన వేడుకల్లో 1300 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన

-

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే. కర్ణాటక రవాణా శాఖ మంత్రి శ్రీరాములు హాజరయ్యారు.

ముందుగా అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం అమిత్ షా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తెలంగాణ విమోచన వేడుకల్లో సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి మొత్తం 7 కేంద్ర బలగాలు కవాతును నిర్వహిస్తున్నాయి. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 8 ట్రూపులు తెలంగాణకు చెందినవి కాగా రెండు మహారాష్ట్ర, మరో రెండు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ట్రూపులున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మరిన్ని అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version