నరేంద్ర మోడీ ని కొట్టాలంటే సెక్యులర్ పార్టీలన్నీ ఏకతాటి పైకి రావాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చిన ఆర్థికవేత్తలకు అవకాశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటు సీఎం కేసీఆర్ నూతనంగా ప్రకటించిన జాతీయ పార్టీపై కూడా హనుమంతరావు మండిపడ్డారు. కెసిఆర్ ఫ్యామిలీ జోడో చేసుకోవాలని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అనేది బిజెపికి బీటింగా ఆయన అభివర్ణించారు.
కేసీఆర్ 1969లో పోలీసుల తూటాలకు చనిపోయిన వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసమే కెసిఆర్ కొత్త పార్టీ పెట్టాడని అన్నారు వీ హనుమంతరావు. రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు.