బాంబ్ బెదిరింపులన్నీ ఆకతాయి పనులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ ఫైర్

-

గత కొద్ది రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు ఫ్లైట్స్‌కు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండటంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విమానయాన సంస్థలు సైతం భారీగా నష్టపోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ బాంబు బెదిరింపు ఘటనలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు.

బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదంతా ఆకతాయిల పని అని.. వీటి వెనుక కుట్రలు ఉన్నాయని నిర్దారించలేమన్నారు. ఈ ఘటనల్లో చాలా మంది మైనర్లు, ఆకతాయిల హస్తం ఉందని తేలిందన్నారు.వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం గురించి చర్చిస్తున్నామని, మంత్రిత్వ శాఖలోని విమానయాన సంస్థలు, భద్రతా సంస్థలతో కూడా మాట్లాడుతున్నామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. కాగా, నిన్న రెండు అంతర్జాతీయ విమానాలతో పాటు విస్తారా,ఇండిగోకు చెందిన దేశీయ కంపెనీలకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version