చిరు కోసం 13 ఏళ్లుగా వెయిటింగ్

-

మెగాస్టార్ చిరంజీవి కోసం దాదాపుగా 13 ఏళ్లుగా వెయిటింగ్ చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి సినిమా కోసం దశాబ్ధం పైగా ఎదురుచూస్తున్నాడట అల్లు అరవింద్. పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీగా చేసిన ఖైది నంబర్ 150 కొణిదెల ప్రొడక్షన్స్ లో చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్లీ తనయుడు రాం చరణ్ నిర్మాణంలోనే సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు మెగాస్టార్.

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో చేయనున్న సినిమాను చరణ్ నిర్మిస్తున్నాడట. బోయపాటి శ్రీను డైరక్షన్ లో చిరంజీవి సినిమా ప్లాన్ చేయగా అది కొరటాల శివ సినిమా తర్వాతే కుదురుతుందని చెప్పాడట. రీ ఎంట్రీ తర్వాత కూడా బావమరిదిని 3,4 ఏళ్లు దాకా వెయిట్ చేయిస్తున్నాడు చిరంజీవి. అయితే బోయపాటి శ్రీనుకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి కచ్చితంగా 2019 సెకండ్ హాఫ్ లో గీతా ఆర్ట్స్ లో చిరంజీవి సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version