బాలీవుడ్ ఎంట్రీకి ఆ కండీషన్ పెట్టిన అల్లు అర్జున్..అదేమిటంటే?

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ‘పుష్ప’..పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఈ ఫిల్మ్ కు చక్కటి ఆదరణ లభించింది. ఐకాన్ స్టార్ యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ ఫిల్మ్..రికార్డులను తిరగరాసింది. హిందీ బెల్ట్ లో అనగా నార్త్ ఇండియాలో అయితే ప్రజలు ఈ పిక్చర్ చూసి వావ్ అనుకున్నారు.

ఈ క్రమంలోనే బన్నీని డైరెక్ట్ హిందీ ఫిల్మ్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. అలా అల్లు అర్జున్ కు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీపై బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీ ఇండస్ట్రీ ఎంట్రీకి తాను రెడీనని చెప్పారు. కానీ, ఒక కండీషన్ పెట్టారు.

ప్రజెంట్ తాను చేస్తున్న తెలుగు చిత్రాలు తనకు సంతృప్తికరంగా ఉన్నాయని, అయితే, ఒకవేళ సరియైన స్క్రిప్ట్ వస్తే కనుక తాను తప్పకుండా బాలీవుడ్(హిందీ)లో ఫిల్మ్ చేస్తానని పేర్కొన్నారు. ఫ్యాన్స్, సినీ లవర్స్ కు ఎంటర్ టైన్మెంట్ అందించే పిక్చర్స్ చేయాలనేది తన కోరికనని చెప్పుకొచ్చారు బన్నీ. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప-2’ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version