నెటిజన్ కు మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంచు లక్ష్మి..!!

-

మంచు లక్ష్మి.. మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె యాంకర్ గా తన తొలి కెరియర్ ను మొదలు పెట్టింది. తర్వాత సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. దీంతో సినీ ఫీల్డ్ కి దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సినిమాల ద్వారా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోకపోయినా.. తనకంటూ ఒక క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇలా ఉండగా తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయమైన ఈమె ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది. ఇక ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించింది మంచు లక్ష్మి. ఇక అంతేకాదు ఈమె ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి .2004 నుండి 2008 వరకు ఇంగ్లీష్ సీరియల్స్ లో నటించిన ఈమె మళ్లీ ఇంగ్లీష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. ఇక బుల్లితెరపై పలు షోలలో వ్యాఖ్యాతగా పనిచేసి.. మొన్నామధ్య వచ్చిన ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్ట్ గా పనిచేస్తుంది.

ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన అలాగే తన కూతురికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇటీవల తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా లాంచ్ చేసి అందులో తన హోమ్ టూర్ వీడియోలను కూడా చేస్తూ మరింత వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్లను కూడా పొందింది. ఇక ఇది పక్కన పెడితే మరొకసారి తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన ఈమెకు.. ఒక నెటిజన్ మీరు దేవుడిని నమ్ముతారా అక్క అని అడగడంతో.. అవును అన్ని నమ్ముతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇకపోతే దేవుడు , దైవం అంటూ తనకున్న భక్తుని నిరూపించిన మంచు లక్ష్మికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version