అల్లు అర్జున్ మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకెళ్లాడు :అల్లు అరవింద్‌

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగానే ఐకాన్ గా నిలిచాడు. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని బన్నీ తీసుకొచ్చాడు. 69 వ నేషనల్ అవార్డ్ ను బన్నీ కైవసం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేస్తున్నారు. ఇక విషయం తెలియడంతో అల్లు అరవింద్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. పుష్ప సినిమా నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ ను కలిసి ఆయనకు స్వయంగా విషెస్ తెలిపారు.

దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. ప్రశ్నలు, సమాధానాలు లేవు.. 69 ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు రాని ఒక అద్భుతాన్ని తీసుకువచ్చిన ఈ తెలుగు ప్రేక్షకులకు, సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకులకు, ఇతర సినిమా బృందానికి, మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకువెళ్లిన మా అబ్బాయికి కృతజ్ఞతలు అన్నారు. కాగా, అల్లు అర్జున్ నివాసానికి పుష్ప సినిమా నిర్మాతలు వచ్చారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్‌ను కౌగిలించుకొని ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ పుత్రోత్సాహంతో కనిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version