వెండితెరపై మెస్మరైజ్ చేసే తారల్ని అభిమానులు తమ పాలిట ప్రత్యక్ష దైవాలుగా భావిస్తుంటారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. అచ్చం ఇలాంటి పనే అల్లు అర్జున్‌ని పిచ్చిగా అభిమానించే ఓ అభిమాని చేశాడు. తన అభిమాన హీరో కోసం ఏకంగా 250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్ చేకున్నాడు. ఈ విషయం తెలసి బన్నీ షాక్ అయ్యారట.
వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాఉఉ చెందిన పి. నాగేశ్వరరావు అనే అభిమాని అల్లు అర్జున్ ని చూడాలని, ఆయన తనని గుర్తించాలని ఓ వినూత్నమైన ఆలోచనతో మాచర్ల నుంచి హైదరాబాద్ వరకు బన్నీ కోసం పాదయాత్ర చేశాడు. ఈ విషయం బన్నీ చెవిన పడింది. వెంటనే నాగేశ్వరరావుని తన ఆఫీసుకి పిలిపించుకుని సర్‌ప్రైజ్ షాకిచ్చాడు. దీంతో నాగేశ్వరరావు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.