ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్‌లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. మనాలీ నుంచి లాహోల్‌స్పితి వ్యాలీ వరకు రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున గుర్రపు నాడా నిర్మించారు. ఈ టన్నెల్‌తో మనాలీ నుంచి లఢఖ్‌లోని లెహ్ వరకు 5-6 గంటల రోడ్డు ప్రయాణ సమయం ఆదాతోపాటు, 45 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. శీతాకాలంలో మంచు కురిసినప్పటికీ.. ఈ రోడ్డును ఇకనుంచి మూసివేయాల్సిన పని ఉండదు. దీంతోపాటు ఈ సొరంగ మార్గం వల్ల సైనికుల రాకపోకలకు కూడా వ్యూహాత్మకంగా మారనుంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోధీ మాట్లాడుతూ… ఈ మార్గం గుండా ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తక్కువ సమయం పడుతుందన్నారు. . సరిహద్దులకు అదనపు బలం సైతం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపొడవైన ఈ టన్నెల్‌ను ఎంతో వేగంగా నిర్మించామన్నారు. దాదాపు 26 ఏళ్లలో జరగాల్సిన ఈ పనిని ఆరేండ్లలో పూర్తి చేశామన్నారు. అభివృద్ధి పనులకు సరిహద్దులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను, సిబ్బందిని, అధికారులను అభినందించారు.