Pushpa Movie: “పుష్ప” అభిమానుల‌కు షాక్..! ఆ నెల‌లో విడుద‌ల క‌ష్ట‌మే !! కారణమ‌దేనా ?

-

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర కెక్కుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల‌ర్ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక కథానాయిక. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయనున్నారు మూవీ మేక‌ర్స్‌. కాగా.. చాలా కాలం తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ ల క్రేజీ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ చిత్రం కావ‌డంతో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా ఫ‌స్ట్ లూక్‌, పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోకు మంచి ఆధ‌ర‌ణ వ‌చ్చింది. తాజా ఈ మూవీ నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో చ‌రిత్ర సృష్టించింది. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ మేక‌ర్స్ భావించారు. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. చిత్ర బృందానికి మరో సమస్య వచ్చి పడింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జ‌రుగుతుంది. ఇంకా రెండు పాటలు, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు ఈ అట‌వీ ప్రాంతంలోనే షూట్ చేయాల్సి ఉంది.

కానీ, ‘గులాబ్‌’ తుపాన్ అడ్డంకిగా మారింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో చిత్ర‌ షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు మూవీ మేక‌ర్స్‌. ఇదే వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఇంకో నాలుగు రోజులు కోన‌సాగితే.. అక్టోబరు చివరి నాటికి షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమేన‌ని అంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విడుదల తేదీపైనా చిత్ర బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ‘పుష్ప’ టీమ్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version