Nani Vs Allu arjun: క్రిస్ట‌మ‌స్ వార్ లో ఇద్దరు హీరోలు!

-

Nani Vs Allu arjun: తెలుగు చిత్రసీమ‌లో సంక్రాంతికి బ‌డా హీరోల సినిమాలు రిలీజ్ చేయ‌డం మామూలే. బాక్స్ ఆఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సృష్టించ‌డం ఖాయం. కానీ.. ఈ సారి హోరా హోరీలో సంకాంత్రి కంటే ముందే.. షూరు అయ్యేలా ఉంది. అది కూడా ఈ సంవ‌త్స‌రం చివ‌ర డిసెంబ‌ర్ లో ఇద్ద‌రూ బ‌డా హీరోల మ‌ధ్య గ‌ట్టిపోటీ నిలకొననున్న‌ది. ఈ సారి క్రిస్ట‌మ‌న్ రేసులో నేచురల్ స్టార్ నాని,   ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ మ‌ధ్య పోరు జోరుగా సాగెలా ఉంది.

నాని డ్యూయెల్ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ”శ్యామ్ సింగ రాయ్”. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ లాంటి తారలు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. నాని త‌న అభిమానులకు స్పెషల్ సర్‏ప్రైజ్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నారు.

అలాగే.. అల్లు అర్జున్, క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ ల కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’ . ఈ చిత్రంలో
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం మీద చాలా అంచనాలు ఉన్నాయి. చిత్రం కూడా ఏడాది డిసెంబర్ లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

దీంతో క్రిస్ట‌మ‌స్ బ‌రిలో ట‌ఫ్ వారే జ‌ర‌గ‌బోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాతో పాటు రవితేజ తన ‘ఖిలాడి’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి.‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘ఎఫ్3’ ఇలా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. మొత్తానికి క్రిస్మస్ వార్ కోసం ఇద్దరు హీరోలు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version