తెలుగు సినిమా పరిశ్రమ లోని నిర్మాత లు ఇప్పుడొక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా అల్లు అరవింద్ గారు కాంతారా అనే కన్నడ సినిమా ను డబ్బింగ్ చేసి తెలుగు లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. పెట్టిన డబ్బుకు ఎన్నోరెట్లు డబ్బులు వసూలు చేసి పెట్టింది. తర్వాత కింగ్ నాగార్జున కూడా కార్తీ సినిమా సర్దార్ ను డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఈ సినిమా కూడా మంచి లాభాలు వచ్చేలా చేసింది.
ఇదే క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా ‘లవ్ టుడే’ సినిమాని డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇప్పటికే ఈ సినిమా 5 రోజుల్లో రూ. 4.70 కోట్లు వసూలు చేసింది. దాదాపు 5రోజుల్లొ రూ. 1.70 కోట్లు లాభాలను దిల్ రాజు జేబులో వేసింది. ఇంకా సూపర్ గా రన్నింగ్ అవుతూనే ఉంది.
దీనితో తెలుగు నిర్మాతలు అందరిలో ఇదే ఆలోచనా దోరణి లో ఉన్నారట. వారికి ఇది పెద్ద రిస్క్ లేని అవకాశంగా మారింది. అన్ని భాషల సినిమాలు చూడడం సినిమా బాగుంటే హుక్కులకు కొని, కొంత డబ్బు పెట్టి, థియేటర్స్ చూసుకుంటే చాలు బాగుంటే లాభాలే లాభాలు.అదే నష్టపోతే కొద్దిగా మాత్రమే పోతుంది.అందుకే మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఐడియా ను ఫాలో కావాలని నిర్ణయించు కున్నారట.