పెళ్ళైన స్టార్ హీరో పై మనసు పారేసుకున్న యంగ్ హీరోయిన్..!

-

సినీ ఇండస్ట్రీలో ప్రేమ అనేది ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం కష్టం. కానీ కొంతమందికి విచిత్రంగా ప్రేమ పుడుతూ ఉంటుంది. నిజానికి ఇండస్ట్రీలో పెళ్లైన స్టార్ హీరో పై కేరళ ముద్దుగుమ్మ మనసు పారేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరా అని సోషల్ మీడియాలో నెటిజెన్ లు తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎవరో కాదు తాజాగా విడుదలై.. సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే సినిమా హీరోయిన్ ఇవాన. లవ్ టుడే సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

అయితే ఈ సినిమాలో ఈమె నటనకి చాలామంది ఫిదా అయిపోయారు. తాజాగా విడుదలై సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే హీరోయిన్ ఇవాన ప్రస్తుతం సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రోజున విడుదలై రూ.మూడు కోట్ల వరకు వసూలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఫలితాన్ని చూసి చిత్ర బృందం ప్రస్తుతం సక్సెస్ చేస్తోంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే కథానాయక ఇవాన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. తెలుగులో ఏ హీరో మీకు ఇష్టం ? అని అడగగా.. మరో మాట ఆలోచించకుండా అల్లు అర్జున్ అంటూ వెంటనే చెప్పేసింది.

అయితే ఇవాన చేసిన ఈ కామెంట్లు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా పుష్ప సినిమా కేరళలో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్ళను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ను చూసిన ఇవానా ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. ఆయన నటించిన ప్రతి సినిమాను చూస్తానని, యాక్టింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టమని, విపరీతమైన క్రష్ అని కూడా తెలిపింది. ఇవాన మొత్తానికైతే తన అభిమానాన్ని చూపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version