Allu Arjun: వెండితెరపైకి మరో నట వారసుడు.. ‘గని’ కోసం బన్నీ కొడుకు..

-

Allu Arjun: సాధార‌ణంగా స్టార్ హీరోల వార‌సులు వెండి తెర‌పై సంద‌డి చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు హీరోలు, హీరోయిన్లుగా ఏంట్రీ ఇస్తున్నారు. వారసులుగా ఏంట్రీ ఇచ్చినా.. టాలెంట్‌తో, నటనతో రాణిస్తున్నారు. తాజాగా అ‍ల్లు అ‍ర్జున్‌ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్‌ జనరేషన్‌ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది.

ఇప్ప‌టికే అల్లు అర్జున్ కూతురు అర్హ‌.. శాకుంత‌లం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అర్హ‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, చిత్రంలో భ‌ర‌తుడి పాత్ర పోషించింది. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా.. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ వెండి తెర మీద అడుగుపెట్టడానికి సిద్ద‌మ‌య్యాడు. వరుణ్‌తేజ్‌ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం​ గ‌ని. ఈ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

అయాన్.. గ‌ని సినిమాలోని పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో అద‌ర‌గొట్టాడు. వ‌రుణ్ తేజ్ చిత్రంలో బాక్స‌ర్ అయ్యేందుకు ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో అయాన్ త‌న స్టైల్‌లో చూపించాడు.తాజాగా.. ఈ మూవీలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌కు అయాన్‌ చేసిన వర్కవుట్‌ వీడియోను గీతా ఆర్ట్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడ‌తుండ‌గా, నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

సోర్ట్స్ బాక్ డ్రాప్ గా తెర‌కెక్కుతున్న‌.. గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్​గా కనిపించనున్నాడు. వరుణ్​ తేజ్​ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ జంటగా న‌టిస్తుంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్రలు ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. అల్లు అరవింద్ స‌మ‌ర్పిస్తున్న ఈ ‘గని’ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version