అల్లు స్టూడియోస్ లో అల్లురామలింగయ్య విగ్రహావిష్కరణ..!

-

దివంగ‌త న‌టుడు జ‌యంతి సంధ‌ర్బంగా ఈరోజు ఆయ‌న మ‌న‌వ‌ళ్లు అల్లు స్టూడియోస్ లో సంద‌డి చేశారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మ‌రియు అల్లు బాబీలు అల్లు స్టూడియోస్ లో అల్లు రామ‌లింగ‌య్య‌కు నివాళులు అర్పించారు. అంతే కాకుండా ఈ రోజు అల్లు రామ‌లింగయ్య విగ్రహాన్ని అల్లు స్టూడియోస్ లో ఆవిష్కిరించారు. ఈ సంధ‌ర్భంగా ముగ్గురు అన్న‌ద‌మ్ములు తాత విగ్ర‌హంతో దిగిన ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఫోటోలో ముగ్గురూ కూడా స్టైలిష్ లుక్ లో ఆక‌ట్టుకుంటున్నారు.

ఇదిలా ఉండ‌గా అల్లు రామ‌లింగ‌య్య వెయ్యికి పైగా సినిమాల‌లో న‌టించి టాలీవుడ్ లో చెర‌గని ముద్ర వేసుకున్నారు. అంతే కాకుండా నిర్మాత‌గా కూడా అల్లు రామ‌లింగ‌య్య ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అల్లు రామ‌లింగ‌య్య వార‌సుడు అల్లు అర‌వింద్ టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూస‌ర్ గా ఎదిగారు. అంతే కాకుండా ఆహా ను స్థాపించి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు కోకాపేట‌లో అల్లు స్టూడియోస్ ను కూడా స్థాపించారు. గ‌తేడాది ఇదే రోజున అల్లు స్టూడియోస్ కు శంకుస్థాప‌న చేయ‌గా ఈ రోజు అల్లు రామ‌లింగయ్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version