ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు…ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. మొత్తం 606 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ బ్యాంక్ భర్తీ చేయనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

SBI

 

స్టేట్ బ్యాంక్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి మూడు నోటిఫికేషన్స్ ని విడుదల చేసింది. 2021 అక్టోబర్ 18 లోగా వీటికి అప్లై చేయాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే..

రిలేషన్‌షిప్ మేనేజర్ -314, రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 20, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్- 217, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 12, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్)- 2, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 2, మేనేజర్ (మార్కెటింగ్)- 12, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) -26, ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్)- 1.

అయితే వేరు వేరు పోస్టులకి వేరు వేరు నోటిఫికేషన్స్ వున్నాయన్న సంగతి తెలిసింది. అయితే ఏ పోస్టుకి ఎలా అప్లై చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్) నోటిఫికేషన్ https://recruitment.bank.sbi/crpd-sco-2021-22-16/apply

రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ https://recruitment.bank.sbi/crpd-sco-2021-22-17/apply

Read more RELATED
Recommended to you

Exit mobile version