‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్..వరుణ్ కోసం రంగంలోకి అల్లు అర్జున్

-

టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌.. వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దల కొండ గణేష్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్.. ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వచ్చింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 2వ తేదీన వైజాగ్ లో జరగనుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగా హీరో అల్లు అర్జున్ రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది గని చిత్రము. ఇక ఈ అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. కాగా… ఈ సినిమా ఏప్రిల్‌ 18 కి విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version