వారి దయతోనే కోలుకున్నా, విజయసాయి రెడ్డి…!

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కరోనా బారిన పడి కోలుకుని బయటపడ్డారు. దాదాపు పది రోజుల నుంచి ఆయన కరోనాతో పోరాడి… అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోలుకుని త్వరగా బయటకు రావాలి అంటూ… వైసీపీ నేతలు, ఆయన అభిమానులు, కార్యకర్తలు పూజలు కూడా చేసారు. తాజాగా విజయసాయి దీనిపై ట్వీట్ చేసారు. తాను కరోనా నుంచి కోలుకున్నా అంటూ పేర్కొన్నారు.

భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నానని ట్వీట్ చేసారు. అందరికీ కృతజ్ఞుడిని మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని విజయసాయి పేర్కొన్నారు. పది రోజుల క్రితం, తనకు కరోనా వచ్చింది అని పరోక్షంగా చెప్పిన ఆయన, సరిగా పది రోజులకు కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version