ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోదు : మంత్రి గొట్టిపాటి

-

విద్యుత్ ఛార్జీల పెంపు అంశం పై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని.. పెంచదని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి.. వాళ్లే ధర్నాలు చేసి వాల్లే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి అని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.

ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోదు. ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. గత కౌన్సిల్ సమావేశాల నుంచి పదే పదే సత్యదూరమైన ప్రచారం చేస్తున్నారు. వారు పెంచిన విద్యుత్ చార్జీలకు వారే ధర్నాలకు పిలుపునిస్తున్నారు. వాళ్లే ప్రశ్నలు వేస్తున్నారు. వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2023-24లోనే 15వేల కోట్ల భారాలు వేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడిదారులను తరిమికొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version