పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్ సింగ్ రాజీనామా, కొత్త సీఎంగా చరణ్ జీత్ సింగ్ చన్నీ నియామకం నుంచి పంజాబ్ కాంగ్రెస్లో లుకలుకలు ఏర్పడ్డాయి. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య మొదలైన రాజకీయ వేడి తాజాగా పీసీసీ ఛీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో రాజకీయం తారాస్థాయికి చేరింది. దీనికి అనుగుణంగానే అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఇరువురు నేతల మధ్య ట్విట్ వార్ జరుగుతోంది. అమరీందర్ సింగ్ను లాలూచీ పడే వ్యక్తిగా సిద్ధూ పరోక్ష విమర్శలు చేస్తే, నిలకడ లేని వ్యక్తిగా, పంజాబ్ లాంటి సరిహద్ధు రాష్ట్రానికి సిద్ధూ నాయకత్వం సరైంది కాదని అమరీందర్ సింగ్ విమర్శిస్తున్నారు. ఇలాంటి వాడీ వేడి రాజకీయం మధ్యలో సిద్ధూ రాజీనామాకు మద్ధతుగా ఆరాష్ట్ర
’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం
-