AMAZING RECORD: రికార్డు ధరకు ప్రభాస్ “సలార్” ఓటిటి రైట్స్…

-

టాలీవుడ్ హీరోగా కుటుంబ కథ చిత్రాలను చేసుకుంటూ ఉన్న ప్రభాస్ రాజమౌళి పుణ్యమా అని బాహుబలి తీసి ప్రపంచంలోని ప్రేక్షకులను ఆకర్శించాడు. ఆ తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అందులో భాగంగానే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇటీవల టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఓ టి టి హక్కులను దక్కించుకోవడానికి కొన్ని సంస్థలు పోటీ పడగా చివరికి ఒక ప్రముఖ ఓ టి టి సంస్థ అధిక మొత్తానికి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రూ. 200 కోట్ల రూపాయలకు సలార్ ఓ టి టి హక్కులు సొంతం చేసుకుంది.

 

కాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ డుంకీ కేవలం రూ. 155 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ రికార్డును ప్రభాస్ దాటేశాడు. ఈ సినిమా నుండి పాటల అప్డేట్స్ త్వరలోనే మన ముందుకు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version