గత మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని ఎడతెరిపిలేని వర్షాలు వరదలతో భీభత్సాన్ని సృష్టించాయి. వాతావరణ శాఖా చెబుతున్న ప్రకారం గత 45 సంవత్సరాలుగా ఎప్పుడో లేని విధంగా ఢిల్లీ మహానగరాన్ని వరదలు తమ ప్రతాపాపాన్ని చూపించాయి. ఈ మూడు రోజుల పాటు రాకపోకలు కానీ.. జనాలు కనీసం కదలలేని స్థితిని తీసుకువచ్చాయి. ఈ వరదల కారణంగా అన్ని రకాలుగా ఢిల్లీ తీవ్రంగా నష్టపోయింది. ఇక ఢిల్లీ మార్కెట్ కూడా చాలా నష్టపోయినట్లుగా ఇండస్ట్రీ బాడీ చెప్పింది, ఈ మూడు రోజుల వరదల ప్రభావంగా రూ. 200 కోట్ల వరకు నష్టం వాటిల్లిందంట. ఇక ఛాంబర్ అఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఢిల్లీ వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో వస్తువులను ఇతర నగరాల నుండి రాకుండా నిలిపివేయడం మంచిదని సూచించింది. కాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు వరదలతో దెబ్బ తిన్న ఢిల్లీ నగరాన్ని ఏ విధంగా మల్లె యాధస్థితికి తీసుకురానున్నారు అన్నది చూడాలి.